అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం

శ్రీనగర్ (CLiC2NEWS): ఆకస్మిక వరదల మూలంగా రద్దయిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం తిరిగి పునఃప్రారంభం అయింది. ప్రతికూల వాతావరణ కారణంగా మూడు రోజుల పాటు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.
కాగా మంచు శివలింగం దర్శనానికి 4,020 మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్ బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.
జమ్మూలోని భగవతినగర్ యాత్రి నివాసం నుంచి 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయలుదేరినట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. వారిలో 1016 మంది ఇవాళ ఉదయం 35 వాహనాల్లో బాల్తాల్ బేస్ క్యాంపునకు బయలుదేరినట్లు తెలిపారు.
మరో 2,425 మంది 75 వాహనాల్లో షెహల్గామ్ బేస్ క్యాంపునకు బయలుదేరినట్లు పేర్కొన్నారు.