అందరినీ అనుగ్రహిస్తా: భవిష్యవాణిలో స్వర్ణలత

హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్‌లోని లష్కర్ భోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాంకాళి బోనాల్లో భాగంగా `రంగం` కార్యక్రమం నిర్వహించారు. జోగిని స్వర్ణలత సోమవారం భవిష్యవాణి వినిపించారు….
“పూజలు మొక్కుబడిగా చేస్తున్నారు. జూలజలు మీ సంతోషానికే చేస్తున్నారు తప్ప నాకోసం కాదు. నాకు పూజలు చేస్తున్నారా.. వాస్తవం చెప్పండి.. పూజలు ఎలా చేయాలో ఏటా నన్నే అడుగుతున్నారు.. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.. మీరు నా గుడిలో పూజలు మొక్కుబడిగా వద్దు.. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి.. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా… నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.. కడుపులో పెట్టుకుంటున్నా… ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు? మఈకు నచ్చినట్టు మారుస్తారా? స‌్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా.. నా రూపాన్ని స్థిరంగా నిలపండి.. మీరేంటి నాకు చేసేది. నేను తెచ్చకున్నదే కదా! దొంగలు దోచినట్టు నాదే కాజేస్తున్నారు. ఏడాదిలోపు నా విగ్రహ ప్రతిష్ట చేయండి. ఎలాంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటాను.. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి.. పిల్లలు, గర్భిణులకు ఎలాంటి ఆపదా రాణివ్వను. “ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.