హీరోతో పెళ్లి పీటలెక్కనున్న నిత్యామీనన్?!

హైదరాబాద్ (CLiC2NEWS): `అలా మొదలైంది` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్ టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచేసింది. ఇష్క్ సినిమాతో ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగారు. దక్షిణాదిలో వరస సినిమాలు చేసి అలరించిన నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ స్టార్ హీతో ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు సినీ పరిశ్రమ కోడై కూస్తోంది.
భీమ్లా నాయక్‌తో ఆమె ఈ మధ్య తెలుగు తెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. కాగా త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కనున్నారంటూ తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. మలయాళీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఆమె పెళ్లి జరగనుందని సమాచారం. గత కొన్నేళ్లుగా వారు ప్రేమలో ఉన్నాని.. అలాగే తమ ప్రేమ విషయాన్ని ఈ మధ్య నే ఇరు కుటుంబ సభ్యులకు తెలిపారని.. ఇరువురి పెద్దలు కూడా అంగీకరించడంతో ఈ జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని పలు వెబ్‌సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నిత్యామీనన్ అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిత్య మీనన్ పెళ్లి చేసుకునే ఆ హీరో గురించి మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.