శ్రీ‌లంక కొత్త సార‌థి ర‌ణిల్ విక్ర‌మ సింఘె

కొలంబో (CLiC2NEWS): తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న శ్రీ‌లంక ప్ర‌జ‌లకు శుభ‌వార్త‌. గ‌త కొద్ది నెల‌లుగు తీవ్ర రాజ‌కీయ సంక్షోభం ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో కొత్త నాయ‌క్త‌వం కోసం బుధ‌వారం జ‌రిగిన ఓటింగ్‌లో యుఎస్ పి పార్టీ అధినేత ర‌ణిల్ విక్ర‌మ సింఘె శ్రీ‌లంక కొత్త అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఇవాళ ఉద‌యం పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కాగానే ఓటింగ్ జ‌రిగింది. ర‌హ‌స్య బాలెట్ విధానంలో జ‌రిగిన ఈ ఎన్నిక‌లో ర‌ణిల్ విక్ర‌మ సింఘే ఆ దేశ 8వ అధ్య‌క్షుడిగా విజ‌యం సాధించారు.

ఆర్థిక సంక్షోభం నేప‌త్యంలో అక్క‌డి ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డిన విష‌యం తెలిసిందే. అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స నివాసాన్ని ఆందోళ‌న‌కారులు చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. దేశంలో పెట్రోలు, డీజిల్‌, నిత్యావ‌స‌రాలు నియంత్రించ‌డంలో గొట‌బాయ ప్ర‌భుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురైన గొట‌బాయ దేశం విడిచి వెళ్లాలా చేశారు.

ఈ నేప‌థ్యంలో ఇవాళ జ‌రిగిన ఓటింగ్‌లో మొత్తం 223 ఓట్లు పోల‌య్యాయి. దాంట్లో నాలుగు ఓట్లు చెల్ల‌లేదు. విక్ర‌మ‌సింఘేకు మ‌ద్ద‌తుగా 134 మంది ఎంపీలు ఓటేశారు. దుల్లాస్‌కు 82, దిస‌నాయ‌కేకు మూడు ఓట్లు పోల‌య్యాయి. కాగా విక్ర‌మ సింఘే ఆరుసార్లు ప్ర‌ధానిగా చేశారు.

Leave A Reply

Your email address will not be published.