అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/illegal-water-connection.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన పలువురి మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రెండు బహుళ అంతస్తుల భవనాలకు తీసుకున్న అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించారు.
ఓ ఆండ్ ఎం డివిజన్ -2(బి)లోని బాలాపూర్ సెక్షన్ పరిధిలోని సంతోష్ నగర్ రక్షకపురం ప్రాంతానికి చెందిన అమ్జద్ తో పాటు మరో 12 మంది వారు నివసించే భవనానికి 15 ఎంఎం పైప్ సైజ్ అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన సయ్యద్ హమీ అలీతో పాటు మరో 24 మంది తమ భవనానికి రెండు 15 ఎంఎం పైప్ సైజ్ అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్న వారిపై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.
I am regular visitor, how are you everybody? This article posted at this website is really fastidious.
Right away I am going to do my breakfast, afterward having my breakfast coming
again to read additional news.