వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని గోదావరి నదీపరీవాహక ప్రాంతం తీవ్రం తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసందే. ఈ వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ బృందానికి రాష్ట్రంలో సంభవించిన వరద, ముంపు నష్టం వివరాలను రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి రాహుల్ బొజ్జా హైదరాబాద్‌లో వారికి వివరాలను అందజేశారు. అనంతరం వారు రెండు బృఃదాలుగా నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వెళ్లారు.
నిజామాబాద్‌లోని ఐదు మండలాల్లో పర్యటించారు. అలాగే జయంశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కూడా పర్యటించారు. కేంద్ర బృందం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో సిఎస్ సోమేశ్ కుమార్‌తో సమావేశం కానన్నారు.