National Film Awads: ఉత్తమ నటులు సూర్య, అజయ్ దేవగణ్..

ఢిల్లీ (CLiC2NEWS): జాతీయ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా సూర్య, అజయ్దేవగణ్లు ఎంపికయ్యారు. సూరారైపోట్రు, (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లో సూర్య నటనకు గానూ, తానాజీలో నటనకు అజయ్దేవగణ్లు ఉత్తమనటుడి అవార్డును పంచుకోనున్నారు. ఉత్తమ నటిగా అపర్ణా బాల మురళి (సూరారైపోట్రు)ని అవార్డు వరించింది. మొత్తం ఐదు కేటగిరీల్లో ‘సూరారైపోట్రు’ అవార్డులు సొంతం చేసుకుంది.
ఉత్తమ చిత్రం: సూరారై పోట్రు
ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియం)
ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు నాట్యం (తెలుగు)
ఉత్తమ మేకప్: నాట్యం (తెలుగు) టి.వి. రాంబాబు
ఉత్తమ సంగీతం (పాటలు): అల వైకుంఠపురములో (తెలుగు) తమన్
ఉత్తమ సంగీతం (నేపథ్య) : సూరారైపోట్రు (తమిళం) జివి ప్రకాశ్‌కుమార్