TS: మ‌రో 2,440 ఉద్యోగా భ‌ర్తీకి స‌ర్కార్ అనుమ‌తి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. తెలంగాణ‌లో మ‌రో 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ స‌ర్కార్ అనుమ‌తిని ఇచ్చింది. ఈమేర‌కు విద్యాశాఖ‌, ఆర్కైవ్స్ శాఖ‌ల‌లో ఉద్యోగా భ‌ర్తీకి అనుమ‌తిని ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల పోస్టులు 1,392, ఇంట‌ర్మీడియ‌ట్ విద్యావిభాగంలో 40 లైబ్రేరియ‌న్‌, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టులు 91, ఆర్కైవ్స్ విభాగాంలో 14 పోస్టులు, పాటిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో 247 లెక్చ‌ర‌ర్‌, 14 ఇన్ స్ట్ర‌క్ట‌ర్‌, 5 మాట్ర‌న్‌, 25 ఎల‌క్ట్రీషియ‌న్‌, 37 పిడీ పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తిని ఇచ్చింది. కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చ‌ర‌ర్‌, 24 లైబ్రేరియ‌న్‌, 29 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీ చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.