అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్.. కంపెనీ మూసివేతకు ఆదేశాలు..

అనకాపల్లి (CLiC2NEWS): అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో మళ్లీ గ్యాస్ లీకై అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం పై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. తక్షణమే కంపెనీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకైన సమయంలో కంపెనీలో సుమారు 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. విషవాయువు లీకవడంతో ఉద్యోగినులు శ్వాస తీసుకోవడం కష్టమై, వాంతులు , వికారంతో అనేక మంది స్పృహకోల్పోయారు. అస్వస్థతకు గురైన వారందరిని ఆస్పత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సింఎ జగన్ ఆదేశించారు.
ఈ ఘటనపై ఎపి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. మరోసారి కంపెనీలో విషవాయువు లీకవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదానికి కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. బాధితులను మంత్రి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.