ఈనెల 5 నుండి 15 తేదీ వరకు అన్ని మ్యూజియంలకు ఫ్రీ ఎంట్రీ..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్న మ్యూజియంలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు ఆగస్టు 5 వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీకాఅమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నా విషయం తెలిసినదే. ఈసందర్బంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలకు.. గోల్కొడ, చార్మినార్‌తో పాటు ఇతర సందర్శన ప్రదేశాలకు స్వదేశీయులతో పాటు విదేశీయులకు కూడా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.