నేడు ‘నీతి అయోగ్’ సమావేశం..

ఢిల్లీ (CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి అయోగ్ పాలకమండలి సభ్యుల సమావేశం ప్రారంభమైంది. దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన, పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటలు మార్పిడి వంటి తదితర అంశాలు నేటి సమావేశంలో చర్చించనున్నారు. .జులై 2019 లో నీతి అయోగ్ సమావేశం జరిగిన తర్వాత కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నీతి అయోగ్ పాలకమండలి సభ్యుల సమావేశం జరగలేదు.