స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో స్వత్రంత్ర భారత వజ్రోత్సవాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసినదే. వజ్రోత్సవాలను రాష్ట్రం అంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. హెచ్ ఐసిసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం కెసిఆర్ వేడుకలను ప్రారంభించారు. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటా జాతీయ పతాకం ఎగురవేసేందుకు 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది.