ఎపి ఐసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌..

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో AP ICET-2022 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కొర‌కు నిర్వ‌హించిన ఐసెట్ -2022 ఫ‌లితాల‌ను ఆంధ్ర యూనివ‌ర్సిటి ఆచార్య పివిజిడి ప్ర‌సాద్ రెడ్డి సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేశారు. జులై 25 వ తేదీన ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 49,157 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా 42,496 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. వీరిలో 37,326 మంది ఆర్హ‌త సాధించార‌ని తెలిపారు. తొలి 10 ర్యాంకుల్లో బాలురు 7ర్యాంకులు సాధించ‌గా.. బాలిక‌లు 3 ర్యాంకుల్లో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.