సికింద్రాబాద్ నుండి తిరుపతి, యశ్వంత్‌పూర్‌కు 4 స్పెషల్ ట్రైన్స్..
హైదరాబాద్ (CLiC2NEWS): వరుస సెలవు రోజులు ఉండటంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుండి తిరుపతికి మరియు యశ్వంత్‌పూర్ స్టేషన్ల మధ్య బుధవారం నుండి శనివారం వరకు ఈ రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే స్పెషల్ ట్రైన్ కాజీపేట, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గూడూరు, రేణిగుంట, స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ నుండి యశ్వంత్‌పూర్ వెళ్లే ట్రైన్ కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, గద్వాల, డోన్, ధర్మవరం, హిందూపురం, యలహంకా స్టేషన్ల మీదుగా నడుస్తుంది.