రూ.200 కోట్ల దోపిడీ కేసు ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరు..
ఢిల్లీ (CLiC2NEWS): సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడుగా ఉన్న రూ. 200కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి ED) పరిగణించింది. ఈ మేరకు కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది. సుమారు రూ. 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేశ్ నుండి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలినట్లు ఈడి వర్గాలు వెల్లడించాయి. సుమారు 10 కోట్ల విలువైన గిప్ట్‌లు అమె కుటుంబసభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతనితో నటికి సన్నిహిత సంబంధాలు ఉన్నయని, సుకేశ్ దోపిడిదారు అని తెలిసినప్పటికి అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
సుకేశ్ చంద్రశేఖర్ రాన్ బాక్సీ మాజి ప్రమోటర్లు మల్విందర్ సింగ్, వివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుండి రూ. 200 కోట్లు వసూలు చేశాడు. అనంతరం బెయిల్ విషయాన్ని వాయిదావేస్తుండగా.. శివిందర్ సింగ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సుకేశ్‌ను 2021లో అరెస్టు చేశారు.