మేడ్చల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కేసిఆర్

మేడ్చల్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ శామీర్‌పేట మండలం అంతాయిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. పరిపాలన ప్రజలకు ఎంత చేరువైతే అంత చక్కగా పనులు జరుగుతాయని సిఎం అన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్టం తెలంగాణయే అని, రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పింఛన్లు అందిస్తున్నారని, అందరికీ కొత్త కార్డులు ఇస్తున్నారన్నారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు గతంలో రూ. 5కోట్ల నిధులు కేటాయించామని, వాటికి అదనంగా మరో రూ. 10కోట్లు మంజూరు చేస్తున్నామని సిఎం తెలిపారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, తెలంగాణ ఏర్పడినపుడు తలసరి ఆదాయం రూ. లక్ష ఉండేదని.. ఇపుడు రూ. 2,78,500గా ఉందని అన్నారు.