సముద్రతీరంలో ఎకె-47 రైఫిళ్లతో ఉన్న పడవ గుర్తింపు..

ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర సముద్ర తీరంలో ఆయుధాలతో ఉన్న పడవ కలకలం రేపుతోంది. రాయ్‌ఘడ్‌లని హరిహరేశ్వర్ బీచ్ ప్రాంతంలో పేలుడు పాదార్థాలు, బుల్లెట్లు, అయుధాల విడిభాగాలున్న పడవను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై పరిసర ప్రంతాలలో భద్రత పెంచారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. పడవను గుర్తించిన ప్రాంతం ముంబయికి 200 కిలోమీటర్లు, పుణెకు 170 కిలో మీటర్ల దూరంలో ఉంది. దీనిని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీనిపై రాయ్‌గడ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపు ‘దహీ హండీ’ జరుపుకోనున్నామని, మరో పది రోజుల్లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఈ పండుగల వేళ ప్రజలు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని సిఎంను కోరారు.