ప్రజల చేతుల్లో ఉండే ఆయుధం ఓటు.. : సిఎం కెసిఆర్
మునుగోడు (CLiC2NEWS): ప్రజల చేతుల్లో ఉండే ఆయుధం ఓటు అని.. ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీ ఉప ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక అని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ టక్కుటమారా మాటలు చూసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“అనేక పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇప్పుడు జీరో ఫ్లోరైడ్ నల్లగొండగా మార్చుకున్నాం తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు తెచ్చుకున్నాం.. కానీ సాగు, నీరు రావాలి. కృష్ణా బేసిన్‌లో డిండి, శిన్న గూడెం, శ్రీశైలం ద్వారా నీరు రావాలి. ఇది మామూలు విషయం కాదు. మునుగోడు ప్రజలు ఆలోచన చేయాలి. అసలు ఇక్కడ ఉప ఎన్నిక ఏం అక్కర ఉందని వచ్చింది. ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఎన్నిక .. దీని వెనుక ఉన్న మాయా మఛ్ఛీంద్ర ఏంటో గుర్తించకపోతే దెబ్బతింటాం“
ఇంకా సిఎం మాట్లాడుతూ.. “ ప్రగతీశీల శక్తులన్నీ కలిసి దుర్మార్గులను సాగనంపాలి. మునుగోడులో టిఆర్ ఎస్‌ను గెలిపించడమే కరెక్టని సిపిఐ మద్దుతు తెలిపింది. సిపిఐకి నా తరఫున, నల్లగొండ జిల్లా ప్రతినిధుల తరఫున కృతజ్ఞతలు“.
“ రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నాం.. దేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా..? రఐతు బంధు ఇవ్వకూడదట.. పింఛన్లు ఎందికిస్తున్నా.. ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నావ్.. అంటున్నారు. మునుగోడు మన జీవితాలకు సంబంధించిన ఎన్నిక.. మీటర్లు పెట్టమనే నరేంద్ర మోడీ కావాలా? మఈటర్లు వద్దనే కేసిఆర్ కావాలా? దీనిపై గ్రామాల్లో చర్చ జరగాలి.. ఎవరు కావాలో మీరు తేల్చుకోవాలి.. మునుగోడు చరిత్రలో ఎన్నడూ బిజెకి డిపాజిట్లు రాలేదు.. “ అని సిఎం కెసిఆర్ వివరించారు.