నిజామాబాద్‌లోని ఓహోట‌ల్‌లో కుటుంబం ఆత్మ‌హ‌త్య‌

నిజామాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ఓ హోట‌ల్‌లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభ‌ర్తులు. పిల్ల‌లుతో స‌హా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఆదిలాబాద్‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి నిజామాబాద్‌లోని ఓ హోట‌ల్లో 15 రోజులుగా ఉంటున్నాడు. అత‌నితోపాటు భార్యా, పిల్ల‌లు కూడా ఉన్నారు. ఆదివారం న‌లుగురు హోట‌ల్ గ‌దిలో విగ‌త‌జీవులుగా క‌నిపించారు. మ‌ర‌ణించిన వారు కొత్త కోట సూర్య‌ప్ర‌కాశ్‌, అక్ష‌య‌, ప్ర‌త్యూష‌, అద్వైత్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.