ఇకపై యుపిఎస్‌సి పరీక్షలకు ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్’ ప్రారంభం

ఢిల్లీ (CLiC2NEWS): దరఖాస్తుల ప్రక్రియ సులభతరం చేసేందుకు యుపిఎస్‌సి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. జాబ్‌కు అప్లై చేసుకోవాలంటే వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇప్పటివరకు యుపిఎస్‌సి ఉద్యోగ్యార్థులకు ఈ సదుపాయం లేదు. సంవత్సరం పొడవునా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేయడానికి యుపిఎస్‌సి పరీక్షలు నిర్వహిస్తుంది. దరఖాస్తు దారుల సమయం వృథా కాకుండా.. పరీక్షలకు అప్లై చేసుకొనేటప్పుడు ప్రతిసారీ ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సిన పనిలేకుండా ఒటిఆర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. దరఖాస్తు దారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని సర్వర్‌లలో సురక్షితంగా స్టోర్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేసేందుకు upsc.gov.inలో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించామని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మొదటిసారి రిజిస్టర్ చేసేటపుడు జాగ్రత్త వహించాలని యుపిఎస్‌సి తెలిపింది.