జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ (CLiC2NEWS): హైదరాబాద్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాలకు సంబంధించిన కేసులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజాప్రతినిధులతో ముడిపెట్టకూడదని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం జర్నలిస్టులకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. కానీ అభివృద్ది చేయలేదు. వారంతా స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టులు వారి స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతిస్తున్నామని అన్నారు. వారు నిర్మాణాలు కూడా చేసుకోవచ్చని జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు.