డివైడర్‌ను ఢీకొట్టిన కారు: భార్యాభర్తలు మృతి

శ్రీకాకుళం (CLiC2NEWS): పైడి భీమవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందివలస గెడ్డ వంతెన వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో భార్యాభర్తలతో పాటు కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు సంతోష్ గాయాలతో బయటపడ్డాడు. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదసమయంలో సంతోషే కారు నడుపుతున్నాడు. వీరిది విశాఖ జిల్లాలోని మల్కపురం ప్రాంతం. వీరికి ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నారు. కుమార్తె వివాహమై అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సంతోష్‌కు వివాహం నిశ్చయమైంది. ఇంతలో ఈ రోడ్డు ప్రమాదం జరిగి కుమారుడి విమాహం చూడకుండానే ఆ దంపతులు విగతజీవులుగా మారడంతో వారి స్వగ్రామంలో విషాదం అలుముకుంది.