రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు

హైదరాబాద్ (CLiC2NEWS): కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఐఎ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హనుమకొండలోని చైతన్య మహిళా సంఘం నేత, కన్వీనర్ ఇళ్లల్లో ఎన్ ఐఎ సోదాలు జరిపారు. ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అనిత, ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నయనే అనుమానంతో ఈ రోజు తెల్ల వారుజామున ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో కూడా సోదాలు జరిపారు.