వైభవంగా కాణిపాక వరసిద్ధి వినాయకుని రథ యాత్ర..
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/KANIPAKA-VINAYAKUDU.jpg)
కాణిపాకం (CLiC2NEWS): కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలల్లో భాగంగా స్వామి వారి రథోత్సవం వర్షంలో కూడా వైభవంగా కొనసాగింది. భక్తులు స్వామివారి రథయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వరసిద్ధి వినాయకస్వామి వారి రథయాత్రలో కోలాట ప్రదర్శనలు, కళాకారుల పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి.