జెఎన్‌టియు పరిధిలోని 30 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు..
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/30-COLLEGES-RECOGNITION-CANCELLED.jpg)
అనంతపురం (CLiC2NEWS): మౌలిక సదుపాయాలు కల్పించలేని 30 ఇంజనీరింగ్ కళాశాలలపై వేటు పడింది. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం( జెఎన్‌టియు) పరిధిలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలలోని 30 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేశారు. ఇక్కడ మొత్తం 98 కాలేజీలు ఉండగా..2022-23 విద్యా సంవత్సరానికి 68 కాలేజీలు మాత్రమే అడ్మిషన్లు కల్పించనున్నారు.
జెఎన్‌టియు పరిధిలోని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయల పర్యవేక్షణ నిర్వహించారు. కాలేజీలలోని వసతులు, విద్యార్థి- బోధనా సిబ్బంది, క్యాంపస్‌ల పనితీరు, గ్రౌండ్ , లైబ్రెరీ సదుపాయాలు, ల్యాబ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అనుబంధ గుర్తింపును రద్దు చేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నత ప్రమాణాలు పాటించే కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని యూనివర్సిటీ కమిటి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాంటి కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జెఎన్‌టియు ప్రొఫెసర్ తెలిపారు.