బ్రిటన్ రాణి ఎలిజబెత్ కన్నుమూత
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/queen-elizabeth.jpg)
లండన్ (CLiC2NEWS): బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు. దాదాపు 70 యేల్ల పాటు బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించారు. గురువారం ఉదయమే రాణి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు అందరూ స్కాటిష్ ఎస్టేట్‌కు చేరుకోవడం మొదలు పెట్టారు. క్వీన్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు అధినేతగా వ్యవహిరంచనున్నారు.
రాణి మరణం ప్రపంచానికి తీరని లోటని చార్లెస్, ప్రధాని లిజ్ ట్రస్ అభివర్ణించారు. నాయకత్వంలో ఎలిజబెత్ బ్రిటిష్ జాతీకి స్ఫూర్తినందించారని భారత ప్రధాని మోడీ సంతాంప సందేశంలో కొనియాడారు.