పోలీసుల‌పై దాడికి యత్నించిన ఎర్ర‌చంద‌నం దొంగ‌లు అరెస్టు

కిలికిరి (CLiC2NEWS): అన్న‌మ‌య్య జిల్లాలో ఎర్ర‌చంద‌నం అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కిలికిరి మండ‌లం గుట్ట‌పాలెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు శ‌నివారం వాహ‌నాల త‌నిఖీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఇన్నోవాకారు, బైక్‌ను ఆపే క్ర‌మంలో ఆ వాహ‌నాలు ఆగ‌కుండా వేగంగా వెళ్లిపోయాయి. ఆ వాహ‌నాల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. వారు రాళ్ల‌తోను క‌ర్ర‌ల‌తోనూ పోలీసుల‌పై దాడికి దిగారు. పోలీసుల‌పై దాడికి య‌త్నించి ప‌రార‌వుతున్న 8 మంది ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుండి రూ. 33.50 ల‌క్ష‌ల విలువైన ఎర్ర‌చంద‌నం స్వాధీనం చేసుకున్నారు. వీరంతా త‌మిళ‌నాడులోని వేలూరు తిరువ‌ణ్ణామ‌లై జిల్లాకు చెందిన వారుగా పోలీస‌లు గుర్తించారు. పోలీసుల‌పై దాడికి య‌త్నించిన ఎర్ర‌చంద‌నం దొంగ‌ల‌ను చాక‌చ‌క్యంగా ఎదుర్కొని, వారిని ప‌ట్టుకొన్నందుకు పోలీసు అధికారుల‌కు రివార్డులు అంద‌జేయ‌నున్న‌ట్లు ఎస్‌పి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.