కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి

శ్రీనగర్ (CLiC2NEWS): జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో మిని బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. పూంచ్ జిల్లాలోని సాజిన్ ప్రాంతం వద్ద 36 మంది ప్రయాణికులతో ఉన్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. స్థానికులు, పోలీసులు సహాక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్ లో జరిగిన బస్సు ప్రమాదం తనను కలచివేసిందని.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఘటనపై జమ్ముకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు.