అక్రమ నిర్మాణాలపై ఎపి హైకోర్టు కీలక ఆదేశాలు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అటవీ, రెవెన్యూ, పంచాయితీ, మున్సిపల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలన్నీ తొలగించాలంటూ ఆదేశాలిచ్చింది. ఆరు నెలల్లో వీటిని తొలగించాలంటూ అధికారులను ధర్మాసనం ఆదేశించింది.