తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): ఈనెల 16 నుండి 18వ తేదీ వరకు తెలంగాణ సమైక్క వజ్రోత్సవాలను వైభవంగా జరపుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ వజ్రోత్సవాల నిర్వహణపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథడ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, సిఎం కెసిఆర్ ఆదేశానుసారం ఈ వజ్రోత్సవాలలో ప్రజాప్రతినిధులు పాల్గొని, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. 16వ తేదీన ర్యాలీలు నిర్వహించి, సభలు, సమావేశాలు జరపాలని, తెలంగాణ చరిత్ర, ప్రస్తుతం తెలంగాన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతిని వివరించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. తెలంగాణ పూర్వ, ప్రస్తుత వైభవాన్ని ప్రజలకు చాటాలన్నారు. 17వ తేదీన జాతీయ జెండా అవిష్కరణలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
ఈ రోజు సిఎం కెసిఆర్ ఆదివాసి, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను ప్రాంభించనున్నారు. 18వ తేదీన జిల్లా కేంద్రాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిలో స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబసభ్యులు, కవులు, కళాకారులను సత్కరించనున్నట్లు తెలిపారు.