హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన ఇండో-పాక్ టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్ టికెట్లు!

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల‌కు పండుగే.. టి 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చిర‌కాల ప్ర‌త్యర్థుల మ్యాచ్ టికెట్లు మొత్తం హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయ‌ని ఐసిసి వెల్లడించింది. స్టాండింగ్ రూం టికెట్లు కూడా నిమిషాల వ్య‌వ‌ధ‌ఙ‌లో అమ్ముడు పోయాయిని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్ల‌డించింది.

అక్టోబ‌రులో ఆస్ట్రేయాలో ప్రారంభం కానున్న టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ల‌క్ష‌ల టికెట్ల‌ను విక్ర‌యించిన‌ట్లు ఐసిఇస పేర్కొంది. ఈ టోర్నీలో అక్టోబ‌రు 23న భార‌త్ -పాకిస్థాన్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జ‌ట్ల‌కు చెందిన అత్యుత్త‌మ ఆట‌గాళ్లు పాల్గొననున్నారు.

Leave A Reply

Your email address will not be published.