ఎపిలోని తొమ్మిది ప్ర‌ధాన ఆల‌యాల్లో ఆన్‌లైన్ సేవ‌లు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్రధాన ఆల‌యాల్లో ఆన్‌లైన్ సేవ‌ల‌ను రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు. శ్రీ‌శైలంలో ఆన్‌లైన్ సేవ‌లను నైన్ అండ్ నైన్ సంస్థ స‌హ‌కారంతో చేప‌ట్ట‌గా.. అది విజ‌య‌వంతం కావ‌డంతో ఇపుడు ఆదే సంస్థ రాష్ట్రంలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో ఆన్‌లైన్ సేవ‌లు ఉచితంగా చేప‌ట్టింద‌ని తెలియ‌జేశారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యానికి ఉత్స‌వాల కోసం ఆన్‌లైన్ సేవ‌లు ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. సింహాచ‌లం, విశాఖ ప‌ట్నం, అన్న‌వ‌రం, ద్వార‌కా తిరుమ‌ల‌, శ్రీ‌కాళ‌హ‌స్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలులో కూడా ఆన్‌లైన్ సేవ‌లు ఇవాల్టి నుండి ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ సేవ‌లు కూడా కొన‌సాగుతాయ‌ని మంత్రి వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.