జనం హృదయాల్లో ఉన్న పేరును ఎవరూ చెరపలేరు: జూనియర్ ఎన్టిఆర్
అమరావతి (CLiC2NEWS): విజయవాడ ఎన్టిఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టిఆర్, కల్యాణ్ రామ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఎన్టిఆర్, వైఎస్ ఆర్ ఇద్దరూ గొప్ప ప్రజాదరణ పొందిన నాయకులు. 25 ఏళ్లకుపైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం వల్ల వారి స్థాయి పెరగదు. ఎన్టిఆర్ స్థాయిని తగ్గించదు. పేరు మార్చడం వలన ఎన్టిఆర్ సంపాదించుకున్న కీర్తిని, ప్రజల హృదయాల్లో ఆయనకున్న స్థానం మారదు. వారి జ్ఞాపకాలు చెరిపివేయలేరు అని జూనియర్ ఎన్టిఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
అదేవిధంగా కల్యాణ్‌రామ్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఈ మహా విద్యాలయానికి 1986లో ఈ విశ్వవిద్యాలయానకి అంకురార్పణ చేశారు. ఈ విద్యాలయం ఎంతో మంది వైద్య నిపుణులను అందించిందని కల్యాణ్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా.. 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది.. అని అన్నారు. రాజకీయ లాభం కోసం చాలామంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాన్ని వాడుకోవడం తప్పని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఎపిలోని డా. ఎన్టిఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరును డా. వైఎస్ ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లును ఎపి శాసనసభ బుధవారం ఆమోదించింది.