ఎపిలో రూ.5లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి: నితిన్ గడ్కరీ
కాకినాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో 2024 నాటికి హైవే ప్రాజెక్టులు పూర్తవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎపిలోని రాజమహేంద్రవరంలో పర్యటించి పలు హైవే ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నౌకాయానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముఖ్యమైనదని అన్నారు. వచ్చే మూడు నెలల్లో మరో రూ. 3వేల కోట్ల ప్రాజెక్టులు ఎపికి అందిస్తామని అన్నారు. భువనేశ్వర్ నుండి భోగాపురం వరకు 6 వరుసల హైవే నిర్మాణం చేపడతామని అన్నారు. విజయవాడ తూర్పు బైపాస్, రాజమహేంద్రవరం-కాకినాడ కెనాల్ రోడ్ మంజూరు చేస్తామన్నారు.