సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాలా.. రూ. లక్ష కట్టండి: ఐటి కంపెనీ పేరిట ఘరానా మోసం
హైదరాబాద్ (CLiC2NEWS): మాదాపూర్‌లో ఓ యువకుడు ఐటి కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తానంటూ సాఫ్టవేర్ సంస్థ పేరిట మోసానికి పాల్పడ్డాడు. ఒక్కొక్కరి వద్ద నుండి రూ. 1 నుండి 1.50 లక్షల చొప్పున వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఓ సాఫ్ట్‌వేర్ సంస్థకు తాను బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌నని చెప్పి, నియామకాలు చేపడుతున్నామని నమ్మించాడు. ఆసక్తి గల వారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్ హైదరాబాద్ జాబ్స్‌పేజీలో పోస్టు చేశాడు.ఉద్యోగం కావాలంటే మూడు నెలలు శిక్షణ తీసుకోవాలని.. తర్వాత ప్లేస్‌మెంట్ ఉంటుందని, శిక్షణ కాలంలో నెలకు రూ. 20వేలు అందిస్తారని చెప్పాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత నెలకు రూ. 30వేలు వరకు జీతం ఇస్తానని నమ్మించాడు. దీంతో సుమారు 200 మంది అతనిని సంప్రదించారు.
కానీ.. బాధితులే చాకచక్యంగా నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనిని పట్టుకునేందుకు పథకం వేసిన బాధితులు ఓ యువతితో ఫోన్ చేయించి, డబ్బులిస్తాము రమ్మని పట్టుకున్నారు.