మానవ హక్కుల పోరాటానికి ‘నోబెల్ శాంతి పురస్కారం’

ఓస్లో (CLiC2NEWS): ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఈ సంవత్సరం బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది ‘అలెస్ బియాలియాత్‌స్కీ’తో పాటు రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన మానవ హక్కుల సంస్థలైన ‘మెమోరియల్’, ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా వరించింది.
బెలారస్‌కు చెందిన న్యాయవాది బియాలియాత్‌స్కీ పౌర హక్కుల కోసం కృషికి ఈ పురస్కారం వరించింది. ఈయన ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకింతం చేశారు. ప్రస్తుతం ఈయన జైల్లో ఉన్నారు.
మానవహక్కుల సంస్థ మెమోరియల్.. రష్యాలో రాజకీయ అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై సమాచారాన్ని క్రమబద్ధంగా నమోదు చేసింది. ‘సివిల్ లిబర్టీస్ సెంటర్’ కీవ్‌లో ఉంది. ఈ సంస్థ ఉక్రెయన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తోంది. ఉక్రెయిన్‌ను పూర్తి స్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు పోరాటం సాగిస్తోంది.