నాసిక్‌లో బస్సు దగ్ధం: 10 మంది మృతి

నాసిక్ (CLiC2NEWS): మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్‌లోని ఔరంగాబాద్ రోడ్డులో ప్రయాణికులతో ఉన్న స్లీపర్ బస్సు డీజిల్ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి. దీంతో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. 24 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతో నిద్రలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నాసిక్ బస్సు ప్రమాదం ఘటనసై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు.