27 సుగంధ పరిమళాలు వెదజల్లే పట్టుచీర..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే సిరిసిల్ల పట్టుచీరను ఆవిష్కరించారు. సిరిసిల్ల నేత కార్మికుడు నల్ల విజయ్ మరమగ్గంపై సుగంధ పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేశారు. దీనికి మంత్రులు సిరి చందన పట్టుగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు విజయ్‌ను అభినందించారు.