ఉప్పల్‌లో తండ్రీ కొడుకుల దారుణ హత్య..

హైదరాబాద్ (CLiC2NEWS): ఉప్పల్‌లో శుక్రవారం తెల్లవారుజామున తండ్రీకొడుకులు హత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీ బొమ్మ వెనెక ఉన్న హనుమాసాయి కాలనీ ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పనిమనిషిని కత్తితో బెదించినట్లు చెబుతోంది. తండ్రిపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డురావడంతో ఇద్దరినీ హత్యచేసినట్లు తెలుస్తోంది. బ్లూ టీషర్టు వేసుకున్న వ్యక్తి పారిపోతుండగా చూసినట్లు స్తానికులు చెపుతున్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి పలు కాలనీలు, గాలింపు చేపట్టారు. ఆస్తికోసం బంధువులే హత్య చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.