త్వరలో దక్షిణాదిన పట్టలెక్కనున్న వందే భారత్ రైలు..!

ఢిల్లీ (CLiC2NEWS):తమిళనాడు-కార్ణాటక మధ్య వందేభారత్ రైలు వచ్చే నెలలో ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐదవ సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ రైలు నవంబర్ 10వ తేదీన పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు ప్రయాణం జరుగుతుంది. ఇటీవల గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించిన విషయం తెలిసిందే. రానున్న మూడేళ్లో దేశంలో 400 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు 2022 బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది.