బ్రిటన్‌లో నేరాల కట్టడిలో ఆటోలు!

లండన్‌ (CLiC2NEWS): ప్రపంచం లోని అగ్ర దేశాలన్నీ అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటున్న సమయం లో బ్రిటన్ పోలీసులు మాత్రం నేరాల కట్టడిలో ఆటోలను వినియోగిస్తున్నారు. ఇండియాలో రవాణా సాధనంగా వినియోగించే ఆటోలను నేరాల నియంత్రణలో వినియోగించనున్నారు. బ్రిటన్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను తమ వాహనాల జాబితాలో చేర్చారు. కాగా భారత్‌కు చెందిన మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానుంది.

ఈ ఆటోలను బ్రిటనÊ పోలీసులు నడక దారులు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాల్లో ఈ ఎలక్ట్రిక్‌ ఆటోలను వినియోగించనున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఆటోల వద్ద ఫిర్యాదులు కూడా చేయవచ్చని అధికారి వెల్లడిరచారు. ‘సేఫ్‌ స్ట్రీట్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ ఆటోలను ప్రవేశపెడుతున్నట్లు బ్రిటన్‌ పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.