గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం విడుదల చేసింది. అభ్యర్థులు tspsc.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రూప్-1 పరీక్ష ఇటీవల నిర్వహించిన విషయం తెలిసినదే. రేపటి నుండి నవంబర్ వ తేదీ వరకు ఓఎంఆర్ పత్రాలు, వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టిఎస్పిఎస్సి తెలిపింది. అభ్యర్థులు టిఎస్పిఎస్సి ఊడి, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్బర్త్ వివరాలు నమోదు చేసి డిజిటల్ పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వచ్చేనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు వెబ్సైట్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొంది.