లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు

హైదారబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుండి ఆన్లైన్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 22వ తేదీనుండి సీట్లను కేటాయించటం జరుగుతుంది. వచ్చేనెల 28వ తేదీనుండి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు lawcet.tsche.ac.in వెబ్సైట్ చూడగలరు.