మంత్రి జగదీశ్ రెడ్డి పిఎ నివాసంలో ఐటి సోదాలు

నల్గొండ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి పిఎ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నిన్న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సోదాలు చేపట్టారు. ప్రభాకర్ రెడ్డిని అతని మిత్రులను పిలిచి విచారించారు. అనంతరం వివరాలు వెల్లడించకుండా అక్కడి నుండి వెళ్లి పోయినట్లు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటి డైరెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్‌లోని కావేరి సీడ్స్, ఆదిత్య ఆగ్రో సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పత్రాలు, ఎలక్ట్రానికి పరికరాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.