ముగిసిన మునుగోడు ఉపఎన్నిక.. 90 శాతం దాటిన పోలింగ్

హైదరాబాద్ (CLiC2NEWS): మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అక్కడడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లో ఉండటంతో అధికారులు వారికి అవకాశం కల్పించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో మొత్తం 47 మంది ఉన్నారు. ప్రధానంగా టిఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్, బిఎస్‌పి, స్వతంత్రులు కలిపి మొత్తం 47 మంది ఉన్నారు.