పంజాబ్ శివ‌సేన పార్టీ నేత సుధీర్ సూరిపై కాల్పులు..

చంఢీగ‌డ్‌ (CLiC2NEWS): అమృత్ స‌ర్‌లో శివ‌సేన పార్టీ నేత సుధీర్ సూరిహ‌త్య‌కు గుర‌య్యారు. ఆయ‌న నిర‌స‌న చేస్తున్న స‌మ‌యంలో ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. దీంతో ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు. ఓ ఆల‌యం స‌మీపంలో ఉన్న చెత్త కుండీలో విగ్ర‌హాలు క‌నిపించాయ‌ని సుధీర్‌సూరి రోడ్డుపై ధ‌ర్నా చేస్తున్నారు. ఆస‌మ‌యంలో జ‌నం మ‌ధ్య‌నుండి వ‌చ్చి ఓదుండ‌గుడు ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపాడు. అనంత‌రం గాల్లోకి కాల్పులు జ‌రిపి పారిపోయాడ‌ని స్థానికులు తెలిపారు. పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌ని వ‌ద్ద‌నుండి ఆయుధాలు స్వాధీనం చేసుక్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.