ఫాంహౌస్ కేసు విచార‌ణ‌కు సిట్‌

సిపి ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ‘ఎమ్మెల్యేల‌కు ఎర’ కేసు ద‌ర్యాప్తున‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం సిట్ హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టేందుకు మొయినాబాద్ పోలీసుల‌కు హ‌కోర్టు అనుమ‌తినిచ్చింది. ఈ నేప‌థ్యంలో కేసు ద‌ర్యాప్తుకు హోంశాఖ కార్య‌ద‌ర్శి ర‌వి గుప్త సిట్ ఏర్పాటుకు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ బృందానికి హైద‌రాబాద్ సిపి సి వి ఆనంద్ నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈ బృందంలో స‌భ్యులుగా సైబ‌రాబాద్ డిసిపి క‌ల్మేశ్వ‌ర్‌, నారాయ‌ణ‌పేట ఎస్‌పి వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ ఎసిపి గంగాధ‌ర్‌, శంషాబాద్ డిసిపి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, మొయినాబాద్ సిఐ ల‌క్ష్మీనారాయ‌ణ, న‌ల్గొండ ఎస్‌పి రెమా రాజేశ్వ‌రి ఉన్నారు.

1 Comment
  1. gate borsası says

    I am a student of BAK College. The recent paper competition gave me a lot of headaches, and I checked a lot of information. Finally, after reading your article, it suddenly dawned on me that I can still have such an idea. grateful. But I still have some questions, hope you can help me.

Leave A Reply

Your email address will not be published.