IND vs ENG: ఫైన‌ల్‌కు నువ్వా.. నేనా..

ఇంగ్లాండ్ ముందున్న ల‌క్ష్యం 169 ప‌రుగులు

అడిలైడ్ (CLiC2NEWS):  టి20 ప్ర‌పంచ‌క‌ప్ రెండ‌వసెమీస్‌లో ఇంగ్లాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భార‌త్ 168 ప‌రుగులు సాధించింది.  రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో టీమ్ ఇండియా బ‌రిలోకి దిగింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్‌ టాస్ గెలిచి బైలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో విజ‌యం సాధించిన టీమ్ ఫైన‌ల్‌లో పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

రెండో సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్ పూర్త‌య్యే స‌రికి  భార‌త్ 168 ప‌రుగులు సాధించింది. ఇంగ్లాండ్‌ ముందు 169 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. కోహ్లీ, పాండ్య హాఫ్ సెంచ‌రీలో రాణించారు. భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగుల స్కోర్ చేసింది. కోహ్లీ 50 ర‌న్స్ చేశాడు. అయితే 16వ ఓవ‌ర్లో కోహ్లీ త్ర‌టిలో ఔట‌య్యే ప్ర‌మాదం నుండి త‌ప్పించుకొన్నాడు. విరాట్‌తో పాటు హార్దిక్ 68 ర‌న్స్ చేశాడు. భార‌త్ వైస్ కెప్టెన్ రాహుల్ 5 రన్స్ చేసి, వికెట్‌ను కోల్పోయాడు. ఇక కెప్టెన్ రోహిత శ‌ర్మ 27 ర‌న్స్ తీసి పెవిలియ‌న్ చేరాడు. సూర్య కూడా 14 ర‌న్స్ చేసి పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు.

ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఆరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టి20 ల‌లో 4 వేల ప‌రుగులు పూర్తిచేసిన తొలి ఆట‌గాడుగా ఘ‌న‌త సాధించాడు.

 

1 Comment
  1. gate io how to deposit says

    Have you ever considered about adding a little bit morethan just your articles? I mean, what you say is fundamental and all.However think of if you added some great visuals or video clipsto give your posts more, “pop”! Your content is excellent butwith images and videos, this blog could certainly be one of the most beneficial in its field.Wonderful blog!Greetings I am so delighted I found your website, Ireally found you by mistake, while I was looking on Bing for something else,Nonetheless I am here now and would just like to say many thanks for a tremendous postand a all round thrilling blog (I also love thetheme/design), I don’t have time to read throughit all at the minute but I have bookmarkedit and also added your RSS feeds, so when I have time I will be back to read agreat deal more, Please do keep up the great work.

Leave A Reply

Your email address will not be published.