IND vs ENG: భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
ఫైనల్‌కు ఇంగ్లాండ్..

అడిలైడ్ (CLiC2NEWS): టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పదివికెట్ల తేడాతో ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్స్ టీమ్ ఇండియాను చిత్తుగా ఓడించారు. భారత్ నిర్ణయించిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా అధిగమించారు. ఇంకా నాలుగు ఓవర్లు మిగిలుండగానే 16 ఓవర్లలో 170 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్స్ అలెక్స్ హేల్స్ 86 పరుగులు, జోస్ బట్లర్ 80 పరుగులు చేసి భారత్‌పై ఘనవిజయం సాధించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడనుంది.