T20 World Cup: ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ సూర్య‌కుమార్‌కేన‌న్న ఇంగ్లాండ్ కెప్టెన్‌..!

T20 World Cup : (CLiC2NEWS): టి 20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. అయితే మ్యాచ్ త‌ర్వాత ఇచ్చే ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్మాచ్’ అవార్డు కోసం తొమ్మిది మంది తో కూడిన జాబితాను ఐసిసి విడుద‌ల చేసింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ భార‌త్‌, షాదాబ్ ఖాన‌ఖ్‌, ష‌హీన్ షా ఆఫ్రిది పాకిస్థాన్‌, సామ్ క‌ర‌న్‌, జోస్ బ‌ట్ల‌ర్ లెక్స్ హేల్స్ ఇంగ్లాండ్‌, సికంద‌ర్ ర‌జా, జింబాబ్వే, వ‌హిందు హ‌స‌రంగ శ్రీ‌లంక ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ మాత్రం టీమ్ ఇండియా ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌కే ఈ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునేందుకు అర్హుడ‌నీ, నా ఓటు మాత్రం అత‌నికే అన‌డం విశేషం.

సూర్య బ్యాటింగ్ సూప‌ర్‌.. ఈ టోర్నీలో స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ చేసి ప‌రుగు రాబ‌ట్టిన ఆట‌గాడే అత‌నేన‌ని.. అత‌ని ఆట‌కోసం ఎదురు చూడ‌టం అద్భుతంగా ఉంద‌ని ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Leave A Reply

Your email address will not be published.